ఒక వారం లో గురుకుల పోస్టింగ్స్
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని విద్యాసంస్థల్లో 8600 పోస్టులకు ఇప్పటికే నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం వారిని సంబంధించిన పాఠశాలలు, కళాశాలల్లో పోస్టింగ్స్ ఇవ్వనుంది. ఈ ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
GURUKULA POSTINGS 2024
8600 మంది నూతన సిబ్బంది వివిధ గురుకుల విద్యాసంస్థల్లో చేరనున్నారు, దీని వలన గురుకుల విద్యాసంస్థల్లో సందడి నెలకొంటుంది.
ఏసీ గురుకులాలు మినహా మిగతా అన్ని గురుకులల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. బదిలీల ప్రక్రియకు డెడ్‌లైన్ జూలై 20. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే పోస్టింగ్స్ ఇవ్వబడతాయి. ఎస్టీ, జనరల్, బీసీ గురుకులాల్లో రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీలను గుర్తించి నూతన పోస్టింగ్ ఇవ్వబడతాయి.
ఎస్సీ గురుకులాల్లో బదిలీల ప్రక్రియ కొన్ని అవాంతరాలు ఉన్నా, వీలైనంత త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియ చేపడతారు.
గురుకుల సొసైటీలు నూతన టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పోస్టింగ్స్ కోసం వెబ్ ఆప్షన్ ఇచ్చి రెండు రోజుల తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రీజింగ్ చేసి, మెరిట్ ఆధారంగా పోస్టింగులు కేటాయిస్తారు.
పోస్టింగ్ ఆర్డర్లను కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్లైన్ ద్వారానే అభ్యర్థులకు పంపించాలని నియామక బోర్డు భావిస్తుంది.
Tags - telangana gurukula jobs, ts gurukula jobs 2024, 8600 gurukula jobs, ts gurukula notification 2024, gurukula jobs apply online 2024, treirb gurukulam jobs,gurukulam jobs, ts gurukulam jobs 2024