ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు
అనర్హులైన పెన్షన్ లబ్ధిదారుల విషయంలో, నోటీసులు పంపడం, ఫీల్డ్ వెరిఫికేషన్, సచివాలయంలో WEA అధికారుల ద్వారా తుది ఆమోదం లేదా తిరస్కారం చేయడం, వెరిఫికేషన్ కోసం పంపడం వంటి ప్రక్రియలను ఎంపీడీవో స్థాయి నుండి ఎన్టీఆర్ భరోసా పోర్టల్ లో నిర్వహిస్తారు.
నోటీసు ఎవరు పంపిస్తారు?
ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులలో అనర్హులుగా ఉన్నవారిని ఎంపీడీవో లాగిన్ ద్వారా ఎనలిజబుల్ రీజన్లు ఎంచుకుని అప్డేట్ చేయవచ్చు.
ఎంపీడీవో లాగిన్ లో అనర్హులుగా గుర్తించిన తర్వాత, WEA లాగిన్ ద్వారా ఆ లబ్ధిదారులకు నోటీసు పంపబడుతుంది.
కొత్త పెన్షన్లకు అవకాశం ఉందా?
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పెన్షన్‌లను మళ్లీ వెరిఫికేషన్ చేస్తుంది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు పంపించి, రిప్లై కోరుతుంది. రిప్లై ఇవ్వనివారిని పెన్షన్ జాబితా నుండి తొలగిస్తారు. రిప్లై ఇచ్చినవారి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత, వారికి కొత్త పెన్షన్ మంజూరు చేయబడుతుంది.
కొత్త పెన్షన్ల విడుదల తేదీ
పూర్తి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతనే కొత్త పెన్షన్లకు అవకాశం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు, కొత్త పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.
కొత్త పెన్షన్ అప్లికేషన్
కొత్త పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
NEW PENSIONS APPLICATION FORM LINK
ప్రస్తుత పెన్షన్ స్టేటస్
ప్రస్తుత పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి, పెన్షన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోండి.
Tags - ntr bharosa pension scheme, ntr bharosa, ntr bharosa pension, ntr bharosa pension news ,ntr bharosa pension latest news, ntr bharosa pension online, ntr bharosa pension pathakam